Fake Universities: నకిలీ యూనివర్శిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ

  • 23 ఫేక్ యూనివర్శిటీల పేర్లను వెల్లడించిన యూజీసీ
  • ఉత్తరప్రదేశ్ లో 8 నకిలీ యూనివర్శిటీలు
  • 7 ఫేక్ యూనివర్శిటీలతో రెండో స్థానంలో ఢిల్లీ

23 నకిలీ యూనివర్శిటీల జాబితాను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా ఈ యూనివర్శిటీలు పని చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపింది. నకిలీ యూనివర్శిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మొత్తం 23 నకిలీ యూనివర్శిటీల్లో 8 వర్శిటీలు యూపీలో ఉన్నాయి. ఢిల్లీలో 7 ఉండగా... పశ్చిమబెంగాల్, ఒడిశా, రాష్ఠ్రాల్లో రెండు చొప్పున ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరిలలో ఒక్కో ఫేక్ యూనివర్శిటీ ఉంది.

ఫేక్ యూనివర్శిటీల జాబితా ఇదే:

ఢిల్లీ: కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, వొకేషనల్ యూనివర్శిటీ, ఏడీఆర్-సెంట్రిక్ జురూడికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎప్లాయిమెంట్, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ.

ఉత్తరప్రదేశ్: వరణసేయ సంస్కృత విశ్వవిద్యాలయ, మహిళా గ్రామ్ విద్యాపీఠ్, గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలెక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ, ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, మహారాణాప్రతాప్ శిక్షానికేతన్ విశ్వవిద్యాలయ, ఇంద్రప్రస్థ శిక్షాపరిషత్.

కర్ణాటక: బదగణ్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ.

కేరళ: సెయింట్ జాన్స్ యూనివర్శిటీ.

పశ్చిమబెంగాల్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్.

ఒడిశా: నవభారత్ శిక్షాపరిషత్, నార్త్ ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ.

పుదుచ్చేరి: శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్.

మహారాష్ట్ర: రాజా అరబిక్ యూనివర్శిటీ.

More Telugu News