Andhra Pradesh: అనంతపురంలో ఇంటిదొంగలు.. 1,012 వేరుశనగ సబ్సిడీ బస్తాలు కాజేసిన సిబ్బంది!

  • విజిలెన్స్ అధికారుల తనిఖీతో వెలుగులోకి
  • ఉరవకొండ మార్కెట్ యార్డులో ఘటన
  • నలుగురు ఎంపీడీవోల సస్పెన్షన్ 

‘కంచే చేనును మేసింది’ అనే సామెతకు సరిపోలిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓవైపు విత్తనాల కొరతతో రైతులు అల్లాడిపోతుంటే వాటిని నకిలీ మార్కెట్ లో అమ్ముకునేందుకు వ్యవసాయ అధికారులు దళారులతో చేతులు కలిపారు. జిల్లాలోని ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు రాయితీపై అందించాల్సిన 1012 బస్తాల వేరుశనగ విత్తనాలను అక్కడి అధికారులు దళారులతో చేతులు కలిపి మాయం చేశారు.

నకిలీ విత్తన పర్మిట్లను చూపించి ఈ విత్తనాలను కాజేశారు. అయితే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. నకిలీ టోకెన్లు, డూప్లికేట్ రసీదులతో రూ.18.51 లక్షల విలువైన వేరుశనగ విత్తనాలను దోచేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై సీరియస్ గా స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం నలుగురు ఎంపీడీవోలను సస్పెండ్ చేసింది. విత్తనాలను తీసుకెళ్లిన దళారులపై క్రిమినల్ కేసు నమోదుచేసింది.

More Telugu News