Allu Arjun: బన్నీ సినిమాలో 'టబు' లుక్ అదిరింది

  • త్రివిక్రమ్ సినిమాతో బిజీగా బన్నీ 
  • కీలకమైన పాత్రలో 'టబు'
  • సంక్రాంతికి విడుదల         

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నివేదా పేతురాజ్ కనిపించనుంది. ఈ సినిమాలో 'టబు' కూడా ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ సందర్భంగా ఆమెకి స్వాగతం చెబుతూ గీతా ఆర్ట్స్ వారు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 'హాయ్' చెబుతూ .. తన పాత్రకి సంబంధించిన డైలాగ్స్ ను చూసుకుంటూ 'టబు' సంప్రదాయబద్ధమైన లుక్ తో చాలా అందంగా కనిపిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

More Telugu News