Rana: సినీ నటుడు రానాకు తల్లి కిడ్నీ దానం.. శస్త్ర చికిత్స విజయవంతం!

  • రానాకు కిడ్నీ సమస్యలు
  • ఓ కిడ్నీ మార్చాల్సిందేనన్న వైద్యులు
  • తల్లి లక్ష్మి ఇచ్చిన కిడ్నీని అమర్చిన అమెరికా డాక్టర్లు

గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న దగ్గుబాటి రానాకు జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయింది. రానా తల్లి తన బిడ్డకు కిడ్నీ ఇచ్చేందుకు ముందు రావడంతో ట్రాన్స్ ప్లాంటేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. గత ఏడాదిగా రానా హైదరాబాద్, ముంబైల్లో కిడ్నీ సమస్యకు చికిత్స పొందారు.

 అయితే, ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించక పోవడంతో, అమెరికాలో చికిత్స పొందాలని భావించారు. అక్కడ కూడా కిడ్నీ మార్చకుంటే లాభంలేదని తేల్చడంతో కన్న బిడ్డ క్షేమం కోసం రానా తల్లి లక్ష్మి తన కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో చికాగో వైద్యులు నెల రోజుల పాటు రానాను అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్సలు చేస్తూ కిడ్నీని సక్సెస్ ఫుల్ గా మార్చారు. ప్రస్తుతం రానా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. తదుపరి ఆయన 'విరాట పర్వం' చిత్రంలో నటించనున్నారు.

More Telugu News