MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ ను పట్టుబట్టి అడ్డుకున్న కోహ్లీ!

  • ధోనీ దూరమైతే జట్టుకు నష్టమే
  • తొలి ప్రాధాన్య కీపర్ గా పంత్
  • టీ-20 వరల్డ్ కప్ వరకూ జట్టుకు ధోనీ సేవలు

వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ముగిసిన తరువాత కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, తన రిటైర్మెంట్ ను ప్రకటించాలని భావించగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి దాన్ని వాయిదా వేసుకునేలా చేశాడట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ధోనీ ప్లేస్ లో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కే స్థానం దక్కుతుందని, అయితే, పంత్ మరింత ప్రతిభను సంపాదించుకుని ఎదిగేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి, అంతవరకూ ధోనీ జట్టులో ఉంటేనే మంచిదని కోహ్లీ చెప్పాడట.

జట్టులో పంత్ తొలి ప్రాధాన్య కీపర్ గా ఉంటాడని, అతనికి సమస్య ఎదురై, ధోనీ అందుబాటులో లేకుంటే స్పెషలిస్టు కీపర్ లేకుండా పోతాడని భావించిన కోహ్లీ, ధోనీ రిటైర్మెంట్ ను వాయిదా వేయించాడని సమాచారం. పైగా, ధోనీకి ఫిట్ నెస్ సమస్యలు లేకపోవడం, 2020లో టీ-20 వరల్డ్ కప్ ఉండటంతో ధోనీ అప్పటివరకూ జట్టులో ఉంటేనే మేలు కలుగుతుందని టీమ్ మేనేజ్ మెంట్ సైతం భావించి, అదే విషయాన్ని ధోనీకి చెప్పడంతోనే తన రిటైర్మెంట్ ను ధోనీ వాయిదా వేసుకున్నాడని తెలుస్తోంది.

More Telugu News