kCR: టీఆర్ఎస్ తప్పులు శిశుపాలుడి తప్పుల్ని మించిపోయాయి: విజయశాంతి

  • కేసీఆర్‌ను వెనకేసుకొచ్చిన గవర్నర్ కూడా మారారు
  • సీఎం నియంతృత్వ ధోరణిని విడనాడాలి
  • లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోమారు ఫైరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టిన తమను జైలుకు పంపుతామని అప్పట్లో కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి గుర్తు చేశారు. ఇంతకాలం కేసీఆర్‌ను వెనకేసుకొచ్చిన గవర్నర్ నరసింహన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని కేసీఆర్‌కు షాకిచ్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పులను మించిపోతున్నాయని ఆరోపించారు.

మునిసిపల్ చట్టం రద్దు విషయంలో కేసీఆర్‌ సర్కారుకు గవర్నర్ ఊహించని ఝలక్ ఇచ్చారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పుల్ని తెలుసుకుని, సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు కూడా తప్పుబట్టిందని, కొన్ని జీవోలను కూడా రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు మొండి వైఖరి అనుసరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని విడనాడాలని విజయశాంతి హితవు పలికారు. 

More Telugu News