సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా..ఆమోదించిన గవర్నర్

23-07-2019 Tue 21:22
  • విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం విఫలం
  • గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేసిన కుమారస్వామి
  • పద్నాలుగు నెలలు సీఎంగా ఉన్న కుమారస్వామి
కర్ణాటక విధానసభలో ఈరోజు నిర్వహించిన విశ్వాస పరీక్షలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణలో విఫలమైన విషయం తెలిసిందే. బలపరీక్షలో ఓటమి అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. సీఎం కుమారస్వామి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.

కాగా, మే 23, 2018న కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పద్నాలుగు నెలల పాలన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈరోజు జరిగిన విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోలేకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది.