ICC: ఇక టెస్టు క్రికెట్లోనూ జెర్సీలపై నంబర్లు!

  • మరికొన్ని రోజుల్లో యాషెస్ సీరీస్ 
  • యాషెస్ సిరీస్ తో అమల్లోకి రానున్న కొత్త విధానం
  • ప్రారంభం కానున్న ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్

మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా ఐసీసీ కొన్ని సరికొత్త విధానాలను ప్రవేశపెడుతోంది. ఇకమీదట టెస్టు క్రికెట్లోనూ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లు ముద్రించనున్నారు. ఇప్పటివరకు ఈ విధానం పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కనిపించింది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్, ఐసీసీ నంబర్లు, పేర్లు ఉన్న జెర్సీలు ధరించిన ఆటగాళ్ల ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశాయి.

ఇక, కాంకషన్ సబ్ స్టిట్యూట్ ను కూడా యాషెస్ సిరీస్ తో ప్రవేశపెడుతున్నారు. కాంకషన్ సబ్ స్టిట్యూట్ అంటే, ఎవరైనా ఆటగాడు తలకు బలమైన దెబ్బ తగిలి ఆటలో కొనసాగే అవకాశం లేకపోతే, అతడికి బదులుగా మైదానంలో దిగే సబ్ స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయొచ్చు. అంతేగాకుండా, యాషెస్ సిరీస్ తోనే ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ కూడా ప్రారంభం కానుంది. ఇకమీదట టెస్టు క్రికెట్ ఆడే దేశాలు ఈ చాంపియన్ షిప్ లో భాగంగా ఇతర జట్లతో టెస్టు మ్యాచ్ లు ఆడతాయి.

More Telugu News