Chandrayaan-2: చంద్రయాన్-2 ప్రయాణంపై తాజా వివరాలు వెల్లడించిన ఇస్రో

  • సోమవారం నింగికెగసిన చంద్రయాన్-2
  • సరైన దిశలోనే పయనిస్తోందన్న ఇస్రో వర్గాలు
  • చంద్రయాన్-2 వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని వెల్లడి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2పై తాజా వివరాలు వెల్లడించింది. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (జీఎస్ఎల్వీ) ఎంకే3ఎం1 ద్వారా సోమవారం చంద్రయాన్-2 నింగికెగసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇస్రో వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతం చంద్రయాన్-2 భూస్థిర కక్ష్యలో సరైన దిశలోనే పయనిస్తోందని తెలిపాయి. చంద్రయాన్-2లో వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని ఓ అధికారి వెల్లడించారు. అందులో ఎలాంటి సందేహంలేదని అన్నారు.  అయితే, ఈ ప్రస్థానంలో ఓ చిన్న మైలురాయి ఉందని, అయితే అదేంటో ఇప్పుడు చెప్పలేమని, తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.

More Telugu News