Jabardast: 'జబర్దస్త్ వినోదిని'పై దాడి కేసు... కోర్టులో లొంగిపోయిన నిందితులు!

  • గత వారం చివరిలో వినోద్ పై దాడి
  • స్థలం వివాదం కారణంగా దారుణంగా కొట్టిన ఇంటి యజమాని కుటుంబం
  • నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు

'జబర్దస్త్‌' రియాల్టీ షోలో అమ్మాయి వేషాలతో పాప్యులర్ అయిన నటుడు వినోద్ అలియాస్ వినోదినిపై దాడి చేసిన నిందితులు హైదరాబాద్, నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఓ స్థలం వివాదం కారణంగా వినోద్ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని బాలాజీ, అతని భార్య ప్రమీల, వారి కుమారులు, కోడలు కలిసి దాడి చేయగా, వినోద్ కు తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎన్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సెక్షన్ 324, 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులంతా న్యాయమూర్తి ముందు హాజరు కావడంతో, ఆయన వారికి రిమాండ్ ను విధించారు. దీంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

More Telugu News