Amrapali: 'ఆమ్రపాలి' రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

  • సుప్రీంకోర్టులో ఆమ్రపాలికి గట్టిదెబ్బ
  • కంపెనీ డైరెక్టర్లపై మనీ లాండరింగ్ కేసులు
  • ప్రాజెక్టులన్నీ ఎన్బీసీసీ చేతుల్లోకి
  • కీలక ఆదేశాలిచ్చిన అత్యున్నత న్యాయస్థానం

ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీకి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్లనూ రద్దు చేయాలని, కంపెనీ డైరెక్టర్లపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలని ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్‌ ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశించింది. కస్టమర్లకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి తీసుకున్న డబ్బును ఇతర కంపెనీల్లోకి మళ్లించారని ఆమ్రపాలిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసును నేడు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తూ, సంస్థ లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది. గ్రేటర్ నోయిడా సహా ఢిల్లీ పరిసరాల్లో ఆమ్రపాలి ప్రారంభించి, మధ్యలో నిలిపివేసిన నిర్మాణాలను పూర్తి చేయాలని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ ను ఆదేశించిన న్యాయమూర్తి, వీటి నిర్మాణాలు పూర్తయిన తరువాత వాటిని కస్టమర్లకు అప్పగించాలని పేర్కొన్నారు.

More Telugu News