Donald Trump: అమెరికా వ్యవస్థలోనే ఏదో లోపం ఉంది: రాంమాధవ్

  • అతి పెద్ద కశ్మీర్ అంశాన్ని అమెరికా చిన్నదిగా భావిస్తోంది
  • ఇండియా, దక్షిణాసియా వ్యవహారాల్లో నిపుణులు వైట్ హౌస్ లో ఉన్నారు
  • అయినా, ట్రంప్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి

కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా భారత రాజకీయ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్యల్లో ఒకటైన కశ్మీర్ వివాదాన్ని చిన్న విషయంగా అమెరికా భావిస్తోందని ఆయన అన్నారు. అమెరికా వ్యవస్థలోనే ప్రాథమికంగా ఏదో లోపం ఉందని విమర్శించారు. ఇండియాతో పాటు దక్షిణాసియా వ్యవహారాల్లో నిపుణులైన లీసా కర్టిస్ వంటి వారు వైట్ హౌస్ లో ఉన్నారని... అలాంటి వారు ఉన్నప్పటికీ, ట్రంప్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏదో లోపాన్ని సూచిస్తోందని అన్నారు.

More Telugu News