Lasith Malinga: వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్న శ్రీలంక పేసర్ లసిత్ మలింగ..26న గుడ్‌బై!

  • 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మలింగ
  • 2011లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై
  • బంగ్లాదేశ్‌తో జరగున్న తొలి వన్డే అనంతరం వీడ్కోలు

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 26న మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ అనంతరం మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె తెలిపాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో 36 ఏళ్ల మలింగ కూడా ఉన్నాడు. అయితే, సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కిప్పర్ కరుణరత్నె మాట్లాడుతూ.. మలింగ తొలి వన్డే మాత్రమే ఆడతాడని ప్రకటించాడు. మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిపాడు. సెలక్టర్లకు అతడు ఏం చెప్పాడో తనకు తెలియదని, కానీ తనకు మాత్రం రిటైర్మెంట్ గురించి చెప్పాడని వివరించాడు.

17 జూలై 2004న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మలింగ 225 వన్డేల్లో 335 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందు దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (523), చామిందా వాస్ (399) ఉన్నారు. ప్రపంచకప్‌లో మాత్రం అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మలింగ పేరుపైనే ఉంది. మొత్తం 7 ఇన్నింగ్స్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. కాగా, మలింగ 2011లోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

More Telugu News