Karnataka: పార్టీలకు విప్ అధికారం ఉందన్న స్పీకర్.. రెబల్ ఎమ్మెల్యేల్లో వణుకు!

  • విప్ అధికారం పార్టీలకు ఉందన్న స్పీకర్
  • రాజీనామాలపై విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • అనారోగ్య కారణాలు సాకుగా చూపి తప్పించుకున్న ఎమ్మెల్యేలు

రోజుకో మలుపు తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. సోమవారం అటోఇటో తేలిపోతుందని అందరూ భావించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి బల నిరూపణకు ముందే అస్త్రసన్యాసం చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, అదంతా ఉత్తిదేనని తేలింది. మరోవైపు, మెట్టుదిగకుండా, ముంబై హోటల్‌లోనే ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు 15 మందికీ ఇప్పుడు ఇంకో భయం పట్టుకుంది. విప్ జారీ చేసే అధికారం పార్టీలకు ఉందని స్పీకర్ రూలింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం.

ముంబై హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలు నేడు సభకు హాజరు కావాల్సిందేనంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీ చేశాయి. ఇంకోవైపు, రాజీనామాలపై విచారణకు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపారు. నిజానికి సోమవారమే వారు సభకు హాజరు కావాల్సి ఉన్నా వారెవరూ రాలేదు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, బీఎస్పీ సభ్యుడు ఒకరు అనారోగ్యం నెపంతో సభకు హాజరు కాకుండా తప్పించుకున్నారు.

More Telugu News