Chandrayaan-2: చంద్రయాన్-2లో ఏకైక విదేశీ పరికరం ఇదే!

  • చంద్రయాన్-2లో 13 స్వదేశీ తయారీ పరికరాలు
  • నాసాకు చెందిన రిఫ్టెక్టోమీటర్ చంద్రయాన్-2లో అమర్చిన వైనం
  • ఐదేళ్లలో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు నాసా ప్రణాళిక

చంద్రయాన్-2 ప్రాజక్టులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది మరికొన్ని రోజుల అనంతరం చంద్రుడి దక్షిణ ధృవంలో ఉపరితలంపై దిగనుంది. కాగా, చంద్రయాన్-2లో వివిధ పరిశోధనల నిమిత్తం 13 స్వదేశీ తయారీ పరికరాలతోపాటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తయారుచేసిన మరో పరికరం కూడా ఉంది. నాసా తన భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం చంద్రయాన్-2లో లేజర్ రిట్రో రిఫ్లెక్టోమీటర్ అర్రే (ఎల్ఆర్ఏ) పరికరాన్ని అమర్చింది.

మరో ఐదేళ్లలో చంద్రుడికి పైకి మనుషులను పంపాలని భావిస్తున్న నాసా, భవిష్యత్ యాత్రలకు ఉపయోగపడేలా రిఫ్లెక్టోమీటర్ కు రూపకల్పన చేసింది. రిఫ్లెక్టోమీటర్ లో ఉండే అద్దం భూమి మీద నుంచి పంపిన లేజర్ సంకేతాలను తిరిగి భూమ్మీదకు పరావర్తనం ద్వారా పంపిస్తుంది. తద్వారా చంద్రుడిపై ల్యాండర్ ఎక్కడ ఉందో స్పష్టంగా గుర్తించే వీలుంటుంది. ఇప్పటికే చంద్రుడిపై ఇలాంటి రిఫ్టెక్లోమీటర్లు ఐదున్నాయి.

More Telugu News