Chandrayaan 2: చంద్రయాన్-2 సక్సెస్.. ఈరోజు మనకు చారిత్రాత్మక దినమన్న ఇస్రో ఛైర్మన్

  • టెక్నకల్ సమస్యను గుర్తించి, రోజుల వ్యవధిలోనే విజయవంతంగా ప్రయోగించాం
  • మార్క్3 రాకెట్ పనితీరు 15 శాతం పెరిగింది
  • చంద్రుడిపై రోవర్ ను సక్సెస్ ఫుల్ గా దింపుతాం

చంద్రయాన్-2ను సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి పంపించామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. మొన్నటి ప్రయోగ సమయంలో టెక్నికల్ సమస్యను గుర్తించి, ప్రయోగాన్ని ఆపేశామని... లోపం ఎక్కడుందో కనిపెట్టి, రోజుల వ్యవధిలోనే సరిచేసి, ఈరోజు విజయవంతంగా ప్రయోగించామని చెప్పారు. చంద్రుడి దిశగా మన దేశ చారిత్రాత్మక ప్రయాణానికి ఇది ప్రారంభమని చెప్పారు.

ఈ ప్రయోగంతో మార్క్3 రాకెట్ పనితీరు 15 శాతం పెరిగిందని చెప్పారు. మార్క్3 విజయం ఇస్రో ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిందని తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న ఇస్రో సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్ ను సక్సెస్ ఫుల్ గా దింపుతామని చెప్పారు. మరోవైపు, చంద్రయాన్-2 సక్సెస్ కు సంబంధించి ఇస్రోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News