Vijay Sai Reddy: లోకేశ్ కు ఓ వ్యాధి... అదే సమస్యగా మారింది: విజయసాయి రెడ్డి!

  • లోకేశ్ కు డన్నింగ్-క్రూగర్ ఎఫెక్ట్
  • తండ్రి అధికారం, ఒక్కడే సంతానం కావడంతో వచ్చింది
  • ట్విట్టర్ లో ఎద్దేవా చేసిన విజయసాయి

నారా లోకేశ్ ఓ వ్యాధితో బాధపడుతున్నాడని, అదే అతనికి సమస్య అయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దాని పేరు డన్నింగ్-క్రూగర్ ఎఫెక్ట్ (తమలోని సామర్థ్యాన్ని అధికంగా అంచనా వేసుకోవడం) అని, లోకేశ్ లో అభిజ్ఞా పక్షపాతం కూడా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు" అని అన్నారు.

More Telugu News