Chandrayaan: 'చంద్రయాన్ 2' కౌంట్ డౌన్... క్రయోజనిక్ దశకు లిక్విడ్ ఆక్సిజన్ ను నింపుతున్న శాస్త్రవేత్తలు!

  • మధ్యాహ్నం 2.43కు ప్రయోగం
  • మొత్తం వ్యయం రూ. 978 కోట్లు
  • అవాంతరాలు రాబోవన్న నమ్మకం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2 ప్రయోగానికి మరో నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యాహ్నం 2.43కు రాకెట్ ప్రయోగం జరుగనుండగా, క్రయోజనిక్ స్టేజ్ ని శాస్త్రవేత్తలు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ లాంచర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎంకే0ఐఐఐ-ఎం1 ద్వారా స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించే క్రమంలో, ఇంధన ట్యాంకుల్లోకి లిక్విడ్ ఆక్సిజన్ ను నింపే పనులను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. ఈ పని కనీసం గంటన్నర పాటు సాగనుంది. మొత్తం రూ. 978 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టి, ఈ నెల 15నే రాకెట్ ను ప్రయోగించాలని భావించగా, నాడు సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయోగం సాఫీగా జరుగుతుందన్న నమ్మకాన్ని సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News