Chandrayaan 2: నేడు చంద్రయాన్-2 ప్రయోగం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

  • చంద్రయాన్-2 ప్రయోగం నేడే
  • మధ్యాహ్నం 2.43 గంటలకు నింగికెగరనున్న జీఎస్ఎల్వీ
  • అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈరోజు చేపడుతోంది. ఈ మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తీసుకుని జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ నింగికి ఎగరనుంది.  ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వర్చువల్ తరగతులు, టీవీ, డిజిటల్ తరగతులు లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రయాన్ ప్రయోగాన్ని విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News