Roja: తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు... రోజా భర్త సెల్వమణి ఘన విజయం!

  • 1,503 ఓట్లలో 1,386 ఆయనకే
  • ప్రత్యర్థి విద్యాసాగర్ కు 100 ఓట్లు
  • ఉపాధ్యక్షుడిగా గెలిచిన కేఎస్ రవికుమార్

తమిళ సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో ఆర్కే సెల్వమణి ఘన విజయం సాధించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆయన, పోలైన 1,503 ఓట్లలో 1,386 ఓట్లను సాధించారు. ఆయన ప్రత్యర్థి విద్యాసాగర్ కు కేవలం 100 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. రాజకీయ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికలు సాగాయి. గత నెలలో అధ్యక్ష పదవికి దర్శకుడు భారతీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఓ వర్గం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ఎన్నికలు జరిపించాల్సిందేనని పట్టుబట్టడంతో ఎన్నికలు జరిపించారు.

దీంతో అధ్యక్ష పదవికి సెల్వమణి, విద్యాసాగర్‌ పోటీలో ఉండగా, ఉపాధ్యక్ష పదవికి కేఎస్ రవికుమార్, రవిమరియ పోటీ పడ్డారు. ఉపాధ్యక్షుడి పదవికి జరిగిన ఎన్నికల్లో కేఎస్ రవికుమార్‌ 1,489 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారికి శుభాకాంక్షలంటూ దర్శకుడు భారతీరాజా ముందుగానే పేర్కొన్నారు. 

More Telugu News