బెంగళూరు అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం కుమారస్వామి

- సీఎం అనారోగ్యం పాలయ్యారంటున్న జేడీఎస్ వర్గాలు
- అదంతా పెద్ద డ్రామా అంటూ బీజేపీ ఆగ్రహం
- బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీకి గైర్హాజరవ్వాలంటూ రెబెల్స్ నిర్ణయం
అటు, కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి విశ్వాసపరీక్ష నిర్వహించేందుకు మరికొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అసంతృప్త ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారు. రేపు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీకి గైర్హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.