Himadas: 'పంచ'కల్యాణి హిమా దాస్ కు సచిన్ అభినందనలు

  • యూరోపియన్ అథ్లెటిక్స్ పోటీల్లో హిమాదాస్ సంచలనం
  • నెలరోజుల వ్యవధిలో ఐదు స్వర్ణ పతకాలు
  • ట్వీట్ చేసిన భారత క్రికెట్ లెజెండ్

భారత అథ్లెటిక్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం అనదగ్గ రీతిలో యువ అథ్లెట్ హిమాదాస్ పసిడి పరుగు అద్భుతంగా కొనసాగుతోంది. యూరోపియన్ సర్క్యూట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో హిమాదాస్ హేమాహేమీలను వెనక్కినెట్టి 5 పసిడి పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతూ భారత కీర్తిపతాకను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడిస్తున్న ఈ అస్సామీ పరుగుల రాణికి భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. "గత నెలరోజులుగా యూరోప్ గడ్డపై నీ పరుగులు చూసి మురిసిపోయాను. విజయం కోసం నీ తపన, నీ సంకల్పదీక్ష యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. 5 స్వర్ణ పతకాలు గెలవడంపట్ల శుభాభినందనలు. భవిష్యత్ లో కూడా మరిన్ని రేసులు గెలవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News