Visakhapatnam District: విశాఖ ఏజెన్సీలో ఘటనపై మంత్రి అవంతి స్పందన

  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం
  • త్వరలో కొత్త వలసకు రోడ్డు మార్గం వేస్తాం
  • గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది

విశాఖ ఏజెన్సీలో గర్భిణి జానపరెడ్డిదేవీ కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. సరైన రోడ్లు, వైద్య సౌకర్యం లేకపోవడంతో దుప్పటిని డోలిలా కట్టి, దాన్ని మోసుకుంటూ పదిహేను కిలోమీటర్ల వరకు గ్రామస్తులు, ఆమె కుటుంబసభ్యులు వెళ్లిన ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, త్వరలో కొత్త వలసకు రోడ్డు మార్గం వేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

More Telugu News