CPI: సీపీఐ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న సురవరం

  • అనారోగ్యం కారణంగా వైదొలిగారన్న పార్టీ వర్గాలు
  • సురవరం స్థానంలో డి.రాజాకు బాధ్యతలు
  • జాతీయ మండలి సమావేశాల్లో నిర్ణయం

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి (76) తప్పుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు సీపీఐ వర్గాలు తెలిపాయి. సురవరం స్థానంలో డి.రాజా సీపీఐ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. జాతీయ మండలి సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన డి.రాజా 1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్నారు. అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ముఖ్యంగా, ఎస్సీల సమస్యలపై రాజా ఎలుగెత్తారు.

కాగా, సురవరం సుధాకర్ రెడ్డి 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మూడో పర్యాయం బాధ్యతలు నిర్వర్తిస్తుండగా అనారోగ్యం పాలవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2021 వరకు ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెండేళ్ల ముందే బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. 

More Telugu News