Karnataka: కంగారెందుకు కుమారా...ఎవరేమిటో రేపు తేలిపోతుందిగా : యడ్యూరప్ప

  • సోమవారం ఊహాగానాలకు తెరపడుతుంది
  • జేడీఎస్‌ జారీ చేసిన విప్‌కు విలువ లేదు
  • సీఎం తీరు అభ్యంతరకం

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీరుపై బీజేపీ నేత యడ్యూరప్ప విరుచుకుపడ్డారు. ఎవరి బలం ఏంటో సోమవారం తేలిపోతుందని స్పష్టం చేశారు. గురువారం జరగాల్సిన విశ్వాస పరీక్ష సోమవారానికి వాయిదా పడిన నేపథ్యంలో యడ్యూరప్ప ఈరోజు ఉదయం రమద హోటల్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి అయివుండి ప్రజాస్వామ్య విలువలకు కుమారస్వామి తిలోదకాలిస్తున్నారని, కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌కు విలువలేదని వ్యాఖ్యానించారు. రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినా విప్‌ జారీ చేయడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. అన్ని ప్రశ్నలకు రేపు సమాధానం దొరుకుతుందని, సీఎం కుమారస్వామి, సీఎల్పినేత సిద్ధరామయ్య వాటికి సిద్ధంగా ఉండాలని కోరారు. కుమార స్వామి ప్రభుత్వానికి రేపే చివరి రోజు అని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

More Telugu News