Amazon: చిన్న పొరపాటుతో అమెజాన్ కు భారీ నష్టం... రూ. 9 లక్షల కెమెరా రూ. 6.500 కే... ఎగబడి కొనేశారు!

  • అమెజాన్ లో సాంకేతిక సమస్య
  • విషయం సోషల్ మీడియాలో వైరల్
  • వస్తువులు ఇచ్చే విషయమై తేల్చని అమెజాన్

ప్రముఖ ఆన్ లైన్ వర్తక సంస్థ అమెజాన్ చేసిన పొరపాటు, ఆ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళితే, గత వారం అమెజాన్, ప్రైమ్ డే సేల్‌ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో పొరపాటున 13వేల డాలర్లు (సుమారు రూ. 9 లక్షలు) విలువైన ఓ కెమెరా రేటును 94 డాలర్లు (సుమారు రూ. 6500)గా ప్రకటించగా, ఓ వినియోగదారుడు కొన్నాడు. ఈ విషయం సోషల్ మీడియా పుణ్యమాని బయటకు వెల్లడి కావడంతో, అమెజాన్‌ లో కెమెరాను కొనేందుకు యూజర్లు ఎగబడ్డారు.

అమెజాన్ టెక్నికల్ వైఫల్యంతో, ఫ్యుజి, కెనాన్, సోనీ వంటి కంపెనీల ఖరీదైన కెమెరాలు అతి తక్కువ ధరకు అమ్ముడయ్యాయి. రూ. 3 వేల నుంచి 5 వేల డాలర్ల వరకూ ఉన్న కెమెరాలు, 100 డాలర్లకులోపే లభించాయి. దీనిపై స్పందించిన అమెజాన్, సైట్‌ లో చోటు చేసుకున్న సాంకేతిక సమస్య కారణంగా ఈ తప్పు జరిగిందని తెలిపింది. ఇక వీరికి కెమెరాలను పంపిస్తారా? అన్న విషయమై సంస్థ ఇంకా ఏమీ తేల్చలేదు.

More Telugu News