Secunderabad: కిటకిటలాడుతున్న ఉజ్జయిని మహంకాళి ఆలయం... స్టెప్పులేసిన తలసాని!

  • సికింద్రాబాద్ లో అమ్మవారి ఆలయం
  • నేడు బోనాలు సమర్పించేందుకు వచ్చిన మహిళలు
  • వీఐపీలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శలు

ఆషాడమాసం సందర్భంగా సికింద్రాబాద్ లో వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన డప్పు చప్పుళ్లకు అభిమానులు, భక్తులతో కలిసి స్టెప్పులేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి బోనాలతో వచ్చిన మహిళలతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి వదిలారు. క్యూలైన్లు నెమ్మదిగా సాగుతున్నాయని, ఇప్పుడు అమ్మ దర్శనానికి వచ్చేవారికి కనీసం నాలుగు గంటల తరువాతే దర్శనమవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులు వీఐపీలకు పెద్దపీట వేస్తూ, సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

More Telugu News