Andhra Pradesh: వార్డు సచివాలయ నియామకాల కోసం ఈ నెల 22న నోటిఫికేషన్

  • ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు
  • అక్టోబరు 2 నుంచి వార్డు సచివాలయ సేవలు
  • రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఆదేశాలు

జగన్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాల ఏర్పాటులో కీలక ముందడుగు పడుతోంది. ఈ నెల 22న వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు జరపనున్నారు. అక్టోబరు 2 నుంచి వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ యోచన. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు.

అంతేగాకుండా, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రం మొత్తమ్మీద 3775 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతి 4 వేల మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయం ద్వారా లబ్దిదారులందరికీ నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వార్డు సచివాలయాలను వార్డు కార్యాలయాల్లోనూ, అంగన్ వాడీ భవనాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

More Telugu News