Kerala: కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు... వరద భయంతో హడలిపోతున్న జనాలు!

  • గత కొన్నిరోజులుగా కేరళను ముంచెత్తుతున్న వర్షాలు
  • మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న ప్రయివేటు వాతావరణ సంస్థ
  • అప్రమత్తమైన కేరళ సర్కారు

కేరళలో గత సంవత్సరం సంభవించిన వరదలు విలయాన్ని సృష్టించాయి. రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి, డ్యాములన్నీ పొంగిపొర్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కేరళ వరద భయంతో వణికిపోతుంది. నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా మారడంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోజికోడ్ జిల్లాలో రికార్డు స్థాయిలో 150 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాయనాడు, మళప్పురం, కణ్ణూర్, ఇడుక్కి, పత్తనంథిట్ట ప్రాంతాల్లోనూ కుంభవృష్టి నమోదైంది.

మరో రెండు రోజుల పాటు కేరళలో పరిస్థితి ఇలాగే ఉంటుందని ఓ ప్రయివేటు వాతావరణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో కేరళ సర్కారు అప్రమత్తమైంది. ఈసారి ఇడుక్కి డ్యామ్ గేట్లను ముందే ఎత్తారు. గతేడాది కేరళను అతి భారీ వర్షాలు ముంచెత్తగా, రెండున్నర దశాబ్దాల అనంతరం ఇడుక్కి డ్యామ్ అన్ని గేట్లను తొలిసారి ఎత్తారు. ఈ సందర్భంగా సంభవించిన వరదల్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

More Telugu News