Mukesh Ambani: వరుసగా 11వ సారి తన వార్షిక వేతనాన్ని తగ్గించుకున్న ముఖేశ్ అంబానీ

  • ఏడాదికి ముఖేశ్ అంబానీ వేతనం రూ.15 కోట్లు
  • 2009 నుంచి ఇదే పంథా
  • యాజమాన్య స్థాయిలో అధిక వేతనాలు అనవసరమని ముఖేశ్ భావన

భారత్ లో నం.1 సంపన్నుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం ఈ ఏడాది కూడా రూ.15 కోట్లే. ఆయన గత దశాబ్దకాలంగా ప్రతి ఏడాది రూ.15 కోట్లతోనే సరిపెట్టుకుంటున్నారు. కంపెనీ చైర్మన్ హోదాలో దాదాపు రూ.40 కోట్ల వరకు తీసుకునే వెసులుబాటు ఉన్నా, 2009 నుంచి ఆయన ఇదే పంథా అనుసరిస్తున్నారు. అదే సమయంలో కంపెనీలోని ఇతర ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ల వేతనాలు మాత్రం భారీస్థాయిలో ఉన్నాయి. అంబానీలకు చుట్టాలైన నిఖిల్ మేస్వానీ, హితాల్ మేస్వానీలు ఏడాదికి రూ.20.57 కోట్లు తీసుకుంటారు.

గతేడాది వేతనంగా రూ.4.45 కోట్లు అందుకున్న ముఖేశ్, కమిషన్ రూపంలో మరో రూ.9.53 కోట్లు, ఇతర భత్యాల కింద 1.02 కోట్ల వరకు స్వీకరించారు. యాజమాన్య స్థాయిలో అధిక వేతనాలు అనవసరమని చెప్పడమే ముఖేశ్ ఉద్దేశమని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన యాన్యువల్ రిపోర్ట్ లో పేర్కొంది.

More Telugu News