Andhra Pradesh: టీటీడీ కీలక నిర్ణయం.. ధర్నాలపై 6 నెలల పాటు నిషేధం!

  • కీలక నిర్ణయం తీసుకున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • టీటీడీలో పలు సంస్కరణకు శ్రీకారం
  • ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలుత వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసిన టీటీడీ చైర్మన్, 2009కి ముందున్న పాత పద్ధతిని పునరుద్ధరించారు. ఈ వీఐపీ దర్శనాల కోటాను సామాన్యులకు కేటాయించాలని టీటీడీ యోచిస్తోంది.

ఈ క్రమంలోనే మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు వీలుగా టీటీడీ చైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో రాబోయే 6 నెలల పాటు ధర్నాలపై నిషేధం విధించారు. 1971 చట్టం మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఈ ఉత్తర్వులను జారీచేశారు.

More Telugu News