Andhra Pradesh: నెల్లూరులో తోళ్ల ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు!

  • కోట మండలంలోని కొత్తపట్నంలో ఘటన
  • తోళ్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని డిమాండ్
  • ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కోట మండలం కొత్తపట్నం గ్రామంలో తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. దీంతో తమ ప్రాంతంలో అస్సలు లెదర్ ఫ్యాక్టరీని పెట్టవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

కాదని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రభుత్వ అధికారులు వెనక్కు వెళ్లిపోవాలని కొత్తపట్నం గ్రామస్తులు నినాదాలు ఇచ్చారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.

More Telugu News