ICC: లేదు.. జింబాబ్వే క్రికెట్‌లో ప్రభుత్వ జోక్యం అస్సలు లేదు: క్రీడల మంత్రి వివరణ

  • జింబాబ్వేను నిషేధించిన ఐసీసీ
  • షాక్‌లో క్రికెటర్లు, ప్రభుత్వం
  • ఐసీసీ ఆరోపణలను ఖండించిన మంత్రి

జింబాబ్వే క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం పెరిగిపోయిందంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ జట్టుపై నిషేధం విధించింది. ఇది ఐసీసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను నిషేధించింది. ఐసీసీ నిర్ణయంతో ప్రభుత్వం సహా ఆ దేశ క్రికెటర్లు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. జింబాబ్వే క్రికెటర్లు విషాదంలో మునిగిపోయారు. క్రికెట్‌నే నమ్ముకున్న వేలాదిమంది జీవితాలు దుర్భరంగా మారనున్నాయంటూ ఆవేదన వ్యకం చేస్తున్నారు.

కాగా, ఐసీసీ నిర్ణయంపై తాజాగా ఆ దేశ క్రీడా మంత్రి కిర్‌స్టీ కోవెంట్రీ స్పందించారు. ఐసీసీ ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒలింపిక్ స్విమ్మింగ్ పతక విజేత అయిన మంత్రి కోవెంట్రీ మాట్లాడుతూ.. క్రికెట్ బోర్డులో ప్రభుత్వం ఏనాడూ తలదూర్చలేదని పేర్కొన్నారు. ఐసీసీ నిర్ణయం ఆటగాళ్ల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News