Priyanka Gandhi: తన భార్య అరెస్ట్ పై రాబర్ట్ వాద్రా స్పందన

  • బాధితులను పరామర్శించడం నేరమా?
  • ప్రియాంక అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం
  • ఆమెను వెంటనే విడుదల చేయాలి

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సోన్ భద్ర జిల్లాలోని సపాహీ గ్రామంలో చోటుచేసుకున్న ఓ భూతగాదాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను పరామర్శించేందుకు ప్రియాంక వెళ్తుండగా... 144 సెక్షన్ అమల్లో ఉందంటూ ప్రియాంకను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

ఈ ఘటనపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. హింసాత్మక ఘటనలో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల కుటుంబీకులను పరామర్శించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రియాంక అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు.

More Telugu News