Telangana: కేసీఆర్‌ నోబెల్ బహుమతికి అర్హుడే: సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ చంద్ర

  • కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన విపిన్ చంద్ర
  • భవిష్యత్తులో నీటి కోసమే మూడో ప్రపంచయుద్ధం
  • కాళేశ్వరం నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలిచారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి అర్హుడని సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, జల్‌శక్తి అభిమాన్ బృందం సభ్యుడు విపిన్ చంద్ర అన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మూడో ప్రపంచయుద్ధం జరిగితే అది నీటి కోసమేనని అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం వ్యూహకర్త అ‌యిన కేసీఆర్‌ నోబెల్ బహుమతికి అన్ని విధాలా అర్హుడని విపిన్ చంద్ర అభిప్రాయపడ్డారు.

More Telugu News