Gold: అమెరికా పుణ్యమాని... ఆరేళ్ల గరిష్ఠానికి బంగారం ధరలు!

  • వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు
  • మధ్య ప్రాచ్య దేశాల్లో అనిశ్చితి
  • 1450 డాలర్లకు ఔన్సు బంగారం ధర

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 2013, మే తరువాత ఆ స్థాయికి బంగారం ధర పెరిగింది. మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్ డ్రోన్ ను యూఎస్ నేవీ కూల్చడం కూడా మార్కెట్ సెంటిమెంట్ ను కుప్పకూల్చగా, పెట్టుబడులు బులియన్ వైపు మళ్లుతున్నాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1450 డాలర్లకు చేరింది. గడచిన వారం రోజుల వ్యవధిలో బంగారం ధర 2 శాతానికి పైగా పెరిగింది. క్రూడాయిల్ ధరలు పెరుగుతూ, డాలర్ బలహీనపడటం కూడా బంగారానికి డిమాండ్ ను పెంచింది. ఇక ఇండియా విషయానికి వస్తే, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 35,333 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర కిలోకు రూ. 41,304 వద్ద ఉంది.

More Telugu News