ICJ: ఐసీజే తీర్పును గౌరవించి కుల్ భూషణ్ జాదవ్ ను విడుదల చేయాలంటూ పాక్ ను కోరిన భారత్

  • కుల్ భూషణ్ కేసులో భారత్ కు అనుకూలంగా ఐసీజే తీర్పు
  • జాదవ్ ను అన్యాయంగా జైల్లో పెట్టారన్న విదేశాంగ మంత్రి జయశంకర్
  • జాదవ్ ను తిరిగి తీసుకొచ్చేంతవరకు తమ ప్రయత్నాలు ఆగవని స్పష్టీకరణ

మూడేళ్లుగా కారాగారంలో మగ్గుతున్న నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ ను వెంటనే విడుదల చేయాలని భారత్ తన పొరుగుదేశం పాకిస్థాన్ ను కోరింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కుల్ భూషణ్ కేసులో ఇచ్చిన తీర్పును పాక్ ప్రభుత్వం గౌరవించాలంటూ భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్ హితవు పలికారు. ఏ పాపం ఎరుగని జాదవ్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని, కనీస చట్టపరమైన విచారణ కూడా లేకుండా అతడిపై దోషిగా ముద్రవేశారని జయశంకర్ వ్యాఖ్యానించారు. జాదవ్ ను తిరిగి భారత్ తీసుకొచ్చేంత వరకు తమ ప్రయత్నాలు ఆగవని, ఈ క్రమంలో  ఏ చిన్న అవకాశాన్నీ కూడా జారవిడుచుకోబోమని స్పష్టం చేశారు.

More Telugu News