స్కూలుకు వెళ్లనని పిల్లాడి మారాం.. బెదిరించడానికి ఏకంగా పోలీసులను పిలిపించిన తల్లి!

- తెలంగాణలోని జడ్చర్లలో ఘటన
- 100 నంబర్ కు ఫోన్ చేసిన మహిళ
- హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు
మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లకు చెందిన మహిళ ఈరోజు పోలీసుల టోల్ ఫ్రీ నంబర్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీస్ సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ఏమయిందని ప్రశ్నించగా..‘నా కొడుకు స్కూలుకు పోనని మారాం చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. సాయం చేయండి సార్’ అని చెప్పింది. దీంతో టెన్షన్ టెన్షన్ గా వచ్చిన పోలీసులు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.