Kulbhushan: కుల్ భూషణ్ కేసు తీర్పుపై పాక్ వక్రబుద్ధి... సెటైర్ వేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

  • మరణశిక్ష నిలిపివేయాలంటూ ఐసీజే తీర్పు
  • తీర్పుకు వక్రభాష్యం చెప్పిన పాక్
  • కుల్ భూషణ్ విడుదల కోసం ప్రయత్నించిన భారత్ కు విఘాతం అంటూ ప్రచారం

వక్రబుద్ధి ప్రదర్శించడంలో పాకిస్థాన్ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్ష అమలు చేయొద్దంటూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వగా, దానికి ఎలా వక్రభాష్యం చెప్పిందో చూడండి! "కుల్ భూషణ్ జాదవ్ ను జైలు నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని భావించిన భారత్ ప్రయత్నాలకు గండిపడింది, భారత్ విజ్ఞప్తిని ఐసీజే తిరస్కరించింది" అంటూ ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాదు, అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ కు భారీ విజయం అంటూ డప్పు కొట్టుకుంటోంది. దీనిపై భారత వర్గాలు స్పందించాయి.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అద్భుతమైన రీతిలో వ్యంగ్యాస్త్రం విసిరారు. "బహుశా ఐసీజే తన తీర్పును ఇంగ్లీషులో పేర్కొనడం వల్ల పాకిస్థాన్ సరిగా అర్థం చేసుకోలేకపోయిందేమో! మరణశిక్షను నిలిపివేయాలని తీర్పులో ఉంది. ఇది పాకిస్థాన్ కు మరోలా అర్థమైనట్టుంది. అందుకే భారత్ విజయం సాధిస్తే తాను విజయం సాధించినట్టుగా చెప్పుకుంటోంది" అంటూ సెటైర్ వేశారు.

More Telugu News