Tirupathi: తిరుపతి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు

  • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
  • ఆగస్టు 1 నుంచి నవంబర్ 1 వరకూ తిరగనున్న రైళ్లు
  • ఓ ప్రకటన విడుదల చేసిన ద.మ.రైల్వే 

తిరుపతి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ మార్గంలో వారంలో మూడ్రోజుల పాటు ప్రత్యేక రైళ్లు తిప్పుతామని చెప్పారు. ఆగస్టు 1 నుంచి నవంబర్ 1 వరకూ ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

తిరుపతి-కాకినాడ టౌన్ 

తిరుపతి నుంచి ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.50 గంటలకు ఈ రైలు (ట్రైన్ నెంబర్ 07432) బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుతుంది.

కాకినాడ టౌన్- తిరుపతి
 
కాకినాడ టౌన్ నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు ఈ రైలు (ట్రైన్ నెంబర్ 07431) బయలు దేరి, మర్నాడు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని, స్లీపర్ క్లాస్, జనరల్ బోగీలు ఉంటాయని ఈ ప్రకటనలో వివరించారు.

More Telugu News