Kumaraswamy: కర్ణాటక అసెంబ్లీలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించిన సీఎం కుమారస్వామి

  • అధికారాన్ని లాక్కునేందుకు కుట్రలు జరుగుతున్నాయి
  • ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి
  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదు

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చను ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి, అధికారాన్ని లాక్కునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని లాక్కునే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలే జరిగాయని చెప్పారు. అప్పుడు జరిగిన ఘటనలే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధులు పార్టీలు మారడాన్ని 1985లోనే చూశామని చెప్పారు. తాను ముఖ్యమంత్రి సీటుకే అతుక్కుపోయి ఉండనని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ప్రజలు ఎవరిని ఆమోదిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

More Telugu News