Andhra Pradesh: పీపీఏలపై కేంద్రం క్లీన్ చిట్ ఇవ్వలేదు.. చంద్రబాబుది అసత్య ప్రచారం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • పీపీఏలు రద్దయితే పారిశ్రామికవేత్తలు వెనక్కిపోతారని చెప్పింది
  • టీడీపీ వారసత్వ, బానిసత్వ పార్టీ
  • అందుకే, ఆ పార్టీ నేతలు బీజేపీ బాట పట్టారు

ఏపీలో గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు (పీపీఏ)లో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చెబుతుండటాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ విషయమై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తే పారిశ్రామికవేత్తలు వెనక్కిపోతారని ఆ లేఖలో చెప్పిందే తప్ప, విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వారసత్వ, బానిసత్వ పార్టీ అని, అందుకే, ఆ పార్టీ నేతలు బీజేపీ బాట పట్టారని అన్నారు. ఏపీ ప్రజలు టీడీపీని తిరస్కరించారని, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో బీజేపీ సభ్యత్వం భారీగా జరుగుతోందని, 2024లో వైసీపీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ కలుస్తాయని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసుకుంటున్నారని సెటైర్లు విసిరారు.

More Telugu News