Narendra Modi: కుల్ భూషణ్ జాదవ్ కు తప్పకుండా న్యాయం జరుగుతుంది: మోదీ

  • పాక్ విధించిన మరణశిక్ష నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం
  • తీర్పును స్వాగతిస్తున్నామంటూ మోదీ ట్వీట్
  • ప్రతి భారతీయుడి సంక్షేమం తమ విధి అంటూ ఉద్ఘాటన

పాకిస్థాన్ చెరలో మగ్గిపోతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేస్తూ తీర్పునివ్వడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కుల్ భూషణ్ జాదవ్ కు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడి సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. వాస్తవాలను పరిశీలించి, సంతృప్తికరమైన తీర్పు ఇచ్చిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయాన్ని ప్రతిబింబించేలా ఈ తీర్పు ఉందని పేర్కొన్నారు.

More Telugu News