Amalapaul: నగ్న సన్నివేశాల గురించి ముందే అమ్మకు చెప్పా: అమలాపాల్

  • ప్రచార చిత్రాల్లో నగ్నంగా కనిపించిన అమలాపాల్
  • ట్రైలర్‌లో సహనటిని ముద్దు పెట్టుకుంటూ కనిపించింది
  • ముద్దు సన్నివేశం స్క్రిప్ట్‌లో లేదన్న అమల

అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆమె’. రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అమలాపాల్ నగ్నంగా కనిపించింది. ట్రైలర్‌లో తన సహనటి ఆర్జే రమ్యను ముద్దు పెట్టుకుంటూ కనిపించింది. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ముద్దు సన్నివేశంపై మీడియా అమలాను ప్రశ్నించింది.

దీనికి స్పందించిన అమల ఓ అమ్మాయిని మద్దు పెట్టుకోవడంలో తప్పేమీ లేదని, అది స్క్రిప్ట్‌లో లేదని, అనుకోకుండా తీసిన షాట్ అని తెలిపింది. ఇక నగ్న సన్నివేశాల గురించి తన తల్లికి ముందే చెప్పానని, స్క్రిప్టుకు కచ్చితంగా అవసరమైతే నటించమని తన తల్లి చెప్పిందని అమల వెల్లడించింది.

ఈ సినిమా శృంగార నేపథ్యంలో సాగేది కాదని, కంటెంట్ అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందేనని అమల తెలిపింది. ఈ చిత్రం నటిగా తనకు ఎంతో నమ్మకాన్నిచ్చిందని పేర్కొంది. తనకు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని అమల స్పష్టం చేసింది.

More Telugu News