కియా సెల్టోస్ కారుకు రికార్డు స్థాయిలో ఆర్డర్లు

17-07-2019 Wed 20:36
  • కియా సెల్టోస్ ఎస్ యూవీకి బుకింగ్స్ ప్రారంభం
  • తొలి రోజు అనూహ్య స్పందన
  • ఆగస్టు 22న మార్కెట్లోకి కియా సెల్టోస్

ప్రపంచ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ మరికొన్ని వారాల్లో భారత్ మార్కెట్లో తన తొలి కారును ప్రవేశపెట్టనుంది. సెల్టోస్ పేరుతో రూపొందిన ఎస్ యూవీ ఆగస్టు 22న మార్కెట్లో అడుగుపెట్టనుండగా, నేడు బుకింగ్స్ ఆరంభమయ్యాయి. అనూహ్యరీతిలో మొదటిరోజే ఏకంగా 6,046 ఆర్డర్లు రావడంతో కియా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆన్ లైన్ లోనూ, కంపెనీ సేల్స్ పాయింట్ల నుంచి ప్రీ బుకింగ్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు. ముందుగా చెప్పిన సమయానికే కారు డెలివరీ ఇవ్వడం ద్వారా కస్టమర్లలో మరింత నమ్మకం పెంపొందిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ విభాగం అధిపతి మనోహర్ భట్ పేర్కొన్నారు. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వస్తున్న ఈ ఎస్ యూవీ ఇతర బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తుందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.