Bay Of Bengal: వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి... తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

  • ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం
  • రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
  • విశాఖ జిల్లాకు భారీ వర్ష సూచన

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. వాయవ్య బంగాళాఖాతం మీద ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రెండ్రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ విభాగం, ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు.

More Telugu News