K.V.R. Mahendra: ఆకలికి తట్టుకోలేక కుళ్లిపోయిన అరటిపండ్లు తిన్నాను: 'దొరసాని' దర్శకుడు కేవీఆర్ మహేంద్ర

  • మాది మధ్యతరగతి కుటుంబం
  • సినిమాలంటే మొదటి నుంచి ఇష్టం
  • బస్ స్టాప్ లో పడుకోవలసి వచ్చిందన్న మహేంద్ర    

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో 'దొరసాని' దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ, కెరియర్ తొలినాళ్లలో తను ఎదుర్కున్న అనుభవాలను గురించి ప్రస్తావించాడు. "మాది వరంగల్ .. మధ్యతరగతి కుటుంబం. సినిమాలకి పనిచేయాలనే ఉత్సాహంతో ప్రయత్నాలు చేస్తున్నాను. ఒక సినిమా టీమ్ లో ఒకరు ఛాన్స్ ఇప్పిస్తానని కబురుచేస్తే హైదరాబాద్ వచ్చానుగానీ, అనుకున్నపని కాలేదు.

దాంతో యూసఫ్ గూడా బస్ స్టాప్ లో ఉండిపోయాను. జేబులో డబ్బులు లేవు .. ఆకలి వేస్తోంది. అప్పటికి అర్థరాత్రి దాటేసింది. అరటిపండ్లు అమ్మే వ్యక్తి కుళ్లిపోయిన పండ్లు పారేయడానికి అటుగా వచ్చాడు. ఆ పండ్లు తీసుకుని తిన్నాను. నేను బాగానే వున్నానని చెప్పి అమ్మానాన్నలకు ఉత్తరం రాసి అక్కడే పోస్ట్ బాక్స్ లో వేశాను. ఆ రాత్రి అదే బస్ స్టాప్ లో పడుకున్నాను. జీవితంలో ఈ సంఘటన నాకు ఒక పాఠం నేర్పించింది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News