Kajal Agarwal: కాజల్ చిత్రాలు రెండూ ఒకే రోజున విడుదల

  • తెలుగులో 'రణరంగం'
  • తమిళంలో 'కోమలి'
  • హిట్ కోసం కాజల్ వెయిటింగ్  

తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు బాషల్లోను ఆమె చాలా కాలంగా అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ఈ రెండు భాషల్లో ఆమె చేసిన సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటం విశేషం. తెలుగులో శర్వానంద్ జోడీగా ఆమె 'రణరంగం' సినిమా చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక తమిళంలో జయం రవి సరసన కాజల్ 'కోమలి' సినిమా చేసింది. ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా అక్కడ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 'రణరంగం' .. తమిళంలో 'కోమలి' హిట్ కావాలనే కాజల్ కోరుకుంటోంది. అదే జరిగితే ఈ రెండు భాషల్లో ఆమెకి మరికొంత కాలం ఢోకా లేనట్టే. 

More Telugu News