Yogi Adityanath: 20 ఏళ్ల నాటి హత్య కేసులో యోగి ఆదిత్యనాథ్ కు ఊరట

  • 1999లో కానిస్టేబుల్ సత్యప్రకాశ్ యాదవ్ హత్య
  • కేసులో నిందితుడిగా ఉన్న యోగి
  • కేసును డిస్మిస్ చేసిన ప్రత్యేక న్యాయస్థానం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఊరట లభించింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 1999లో మహరాజ్ గంజ్ జిల్లాలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ సత్యప్రకాశ్ యాదవ్ హత్య కేసులో యోగి ఆదిత్యనాథ్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కేసును డిస్మిస్ చేసింది. కేసును దర్యాప్తు చేసిన సీబీసీఐడి కోర్టుకు చివరి నివేదికను అందజేసింది. ఇందులో యోగికి సీబీసీఐడీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు కేసును డిస్మిస్ చేసింది.

హత్య జరిగిన సమయంలో (1999) సత్యప్రకాశ్... సమాజ్ వాదీ పార్టీ నేత తలత్ అజీజ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్నారు. యోగి అతని అనుచరులు సత్యప్రకాశ్ అతని మద్దతుదారులపై జరిపిన కాల్పుల్లో... సత్యప్రకాశ్ మరణించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు జరిపింది.

More Telugu News