Gujarath: గుజరాత్ లోని ఆ గ్రామంలో పెళ్లికాని అమ్మాయి ఫోన్ వాడితే తండ్రికి లక్షన్నర జరిమానా!

  • పెళ్లి కాకుండా ఫోన్లు వాడటంపై నిషేధం 
  • వివాహ వేడుకల్లో డీజేలు, బాణసంచా ఆపేయాలి 
  • గుజరాత్ లోని బాణస్కాంతలో పెద్దల నిర్ణయం

పెళ్లికాని అమ్మాయి ఎవరైనా మొబైల్ ఫోన్ వాడితే, అతని తండ్రి నుంచి లక్షన్నర రూపాయలు జరిమానాగా వసూలు చేయాలని గుజరాత్ లోని ఓ గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ ఘటన రాష్ట్రంలోని బాణస్కాంత గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడి పెద్దలు సమావేశమై, ఠాకూర్ వర్గంలోని పెళ్లి కాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అమ్మాయి ఫోనే వాడితే, ఆమె తండ్రి నుంచి రూ. లక్షన్నర జరిమానాగా వసూలు చేయాలని పెద్దలు నిర్ణయించారు.

 ఇక ఇదే సమయంలో గ్రామ పెద్దలు కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వివాహ సమయాల్లో డీజేలు వద్దని, బాణసంచా కాల్చడాన్ని ఆపివేయాలని పెద్దలు నిర్ణయించారు. ఏ అమ్మాయి అయినా వారి పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అది నేరమేనని అన్నారు. ఇక దీనిపై యువనేత అల్పేష్ ఠాకూర్ స్పందిస్తూ, పెళ్లి ఖర్చుల విషయంలో పెద్దల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ఇదే సమయంలో మొబైల్ ఫోన్ల విషయంలో మాత్రం నిషేధం మంచిది కాదని అన్నారు.

More Telugu News